భూ సమస్యలపై రైతులతో చర్చించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-28T11:15:09+05:30 IST

మండలంలోని ఇటిక్యాలలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన రైతుల పొలాల్లోనే క్షేత్రస్థాయిలో తిరిగి వారితో

భూ సమస్యలపై రైతులతో చర్చించిన కలెక్టర్‌

జగదేవ్‌పూర్‌, జూలై 27: మండలంలోని ఇటిక్యాలలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన రైతుల పొలాల్లోనే క్షేత్రస్థాయిలో తిరిగి వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక భూసమస్యల పూర్వాపరాలను ఆ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్న వాటిపై యాజమాన్య హక్కులు లేక తీవ్ర అగచాట్లు పడుతున్నామని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. అత్యంత పారదర్శకంగా భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని వెంకట్రామారెడ్డి వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్లు బాల్‌ రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-28T11:15:09+05:30 IST