‘గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌’ చైర్మన్‌ ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం

ABN , First Publish Date - 2020-12-05T05:56:55+05:30 IST

గజ్వేల్‌,డిసెంబరు4: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు

‘గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌’ చైర్మన్‌ ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం

గజ్వేల్‌,డిసెంబరు4: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా రామచంద్రాపురం బూత్‌-1లో  ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో కరోనా సోకడంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ఆయనను ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ మాట్లాడడం కొండంత ధైర్యాన్నిచ్చిందని చెప్పారు.


Updated Date - 2020-12-05T05:56:55+05:30 IST