సృజనాత్మకతకు నిదర్శనం సినిమా
ABN , First Publish Date - 2020-03-02T11:22:52+05:30 IST
సృజనాత్మకతకు నిదర్శనంగా ‘సమ్మర్ రాప్సోడి’ సినిమా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెప్పారు.

- భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ
సిద్దిపేట: సృజనాత్మకతకు నిదర్శనంగా ‘సమ్మర్ రాప్సోడి’ సినిమా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ శనివారం రాత్రి హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సినీవారం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన మాస్టర్ పూర్ణబోధ నటించి, కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాతీయ ఉత్తమ చిత్రంగా రూ. ఐదు లక్షల బహుమతి అందుకున్న ‘సమ్మర్ రాప్సోడి’ చిత్ర ప్రదర్శనను తిలకించి ఆయన మాట్లాడారు. తెలంగాణాలో ప్రతిభగల దర్శకులు, నటులకు కొదవలేదని కొనియాడారు. వారిని ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నదని అన్నారు. తెలంగాణ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ మాట్లాడుతూ ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరముందన్నారు. దర్శకుడు శ్రావణ్, నటుడు పూర్ణబోధను వారు సత్కరించారు.