సంగారెడ్డి జిల్లాలో 70 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-06T10:04:50+05:30 IST

జిల్లాలో శనివారం 70 మందికి కరోనా నిర్ధారణ అయినదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో 70 మందికి కరోనా పాజిటివ్‌

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 5: జిల్లాలో శనివారం 70 మందికి కరోనా నిర్ధారణ అయినదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో-12, సదాశివపేట-10, పటాన్‌చెరు-5, నందిగామ-4, పోసానిపేట-4, వెలిమెల-4, ఆర్‌సీపురం-3, పుల్‌కల్‌-3, భానూర్‌-3, భీరంగూడ-3, ఎల్గోయ్‌-2, ముత్తంగి-2, గుంతమర్‌పల్లి-2, వెల్టూర్‌, కిష్టారెడ్డిపేట, బోర్పట్ల, బూసారెడ్డిపల్లి, పటేల్‌గూడ, గోపులారం, జోగిపేట, అందోల్‌, బోరంచ, ఇంద్రేశం, కాశీపూర్‌, తునికిల తండా, బేగంపేటలో ఒకరికి కరోనా నిర్ధారణ అయినదని వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన 70 మందిలో 67 మంది హోంఐసోలేషన్‌లో ఉండగా, ఒకరు ప్రభుత్వ, ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్‌వో చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,494 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశామన్నారు. మొబైల్‌ వ్యాన్‌ ద్వారా 118 మంది శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కి పంపామని చెప్పారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 109 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీకి పంపామని డీఎంహెచ్‌వో వెల్లడించారు.  

Updated Date - 2020-09-06T10:04:50+05:30 IST