గ్రీన్‌జోన్‌లో ఉన్నా జాగ్రత్త తప్పనిసరి

ABN , First Publish Date - 2020-05-10T10:05:24+05:30 IST

సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉన్నా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా

గ్రీన్‌జోన్‌లో ఉన్నా జాగ్రత్త తప్పనిసరి

సిద్దిపేట సిటీ, మే 9: సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉన్నా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా ముఖానికి మాస్కు వేసుకోవాలని, లేదంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని అంబేద్కర్‌నగర్‌ అరుంధతి కల్యాణ మండపంలో గ్యాదరి బాలరాజు కరాటే జ్ఞాపకార్థం కరుణకాంతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 1,400 పేదల కుటుంబాలకు, నీలకంఠ సమాజంలో 400 మంది చేనేత కార్మికులకు, నియోజకవర్గ పరిధిలోని 300 మంది నిరుపేద కైస్త్రవులకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్‌లను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కరోనా ఫ్రీ జిల్లా అయినా  ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని, లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


నేడు కాకపోతే రైపైనా కరోనాతో సహజీవనం తప్పేట్టు లేదని, అందుకే జాగ్రత్తలు పాటించడం, భౌతిక దూరం పాటించడం ప్రజల జీవితంలో భాగం కావాలన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో కష్టనష్టాలు ఎదర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కోవిద సహృదయ ఫౌండేషన్‌ఆధ్వర్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. 21 మంది గర్భిణులకు రూ.10 వేల చొప్పున వెండి సామగ్రి, పట్టు వస్త్రాలను అందజేసి సీమంతాలు చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం నంగునూరు, చిన్నకోడూర్‌ మండలాల్లో ఇటీవల అకాల వర్షాలకు ఇళ్లు కూలిన బాధితులకు రూ. 2.09 లక్షల నష్టపరిహారం అందజేశారు.


ఇంకా ఎవరైనా అర్హులుంటే పరిహారం అందజేసేందుకు నివేదిక రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T10:05:24+05:30 IST