భవనంపై నుంచి పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2020-03-25T13:11:36+05:30 IST
భవనంపై నుంచి బాలుడు పడి మృతిచెందిన సంఘటన పాశమైలారంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన ప్రతా్‌పసింగ్, భవిత దంపతులు పాశమైకారంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

పటాన్‌చెరు రూరల్, మార్చి 24 : భవనంపై నుంచి బాలుడు పడి మృతిచెందిన సంఘటన పాశమైలారంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన ప్రతా్‌పసింగ్, భవిత దంపతులు పాశమైకారంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు అంకుష్ (3) ఉన్నాడు. మంగళవారం ఉదయం 11 గంటలకు అద్దెకుంటున్న మూడంతస్తుల మేడపై నుంచి ఆడుతూ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బీడీఎల్ పోలీసులు కేసు మోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.