విషపురాతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-10-31T06:52:42+05:30 IST
తప్పుడు వార్తలు రాసి, ప్రధానమంత్రి, బీజేపీ గౌరవాన్నీ దెబ్బతీసే విధంగా ఓ దిన పత్రిక విషపురాతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శుక్రవారం బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ : తప్పుడు వార్తలు రాసి, ప్రధానమంత్రి, బీజేపీ గౌరవాన్నీ దెబ్బతీసే విధంగా ఓ దిన పత్రిక విషపురాతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శుక్రవారం బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు చేసిన విద్యుత్ చట్టాన్ని అవమాన పరుస్తూ ఆ పత్రిక అబద్ధపు వార్తలను ప్రచురించినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజక వర్గంలో ఉచితంగా పత్రికలను పంపిణీ చేశారని, వాటి విలువను టీఆర్‌ఎస్ అభ్యర్థి అకౌంట్లలో వేయాలని కోరారు. ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించేలా తనకు ఓటర్లలో ఉన్న సానుకూలతను దెబ్బతీసేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపత్రిక ప్రచురణను వెంటనే నిలుపుదల చేయాలని, ఆర్‌ఎన్‌ఐ రిజిస్ట్రేషన్ రద్దుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.