ఘనంగా బిషప్‌ సాల్మన్‌రాజ్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-03-19T07:19:05+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎ్‌సఐ చర్చి బిషప్‌ ఏ.సీ.సాల్మన్‌రాజ్‌ జన్మదిన వేడుకలు చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్‌ మాట్లాడుతూ సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఘనంగా బిషప్‌ సాల్మన్‌రాజ్‌ జన్మదిన వేడుకలు

మెదక్‌ కల్చరల్‌, మార్చి 18 : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎ్‌సఐ చర్చి బిషప్‌ ఏ.సీ.సాల్మన్‌రాజ్‌ జన్మదిన వేడుకలు చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్‌ మాట్లాడుతూ సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎ్‌సఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆస్పత్రిని, వెస్లీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ సంఘ అధ్యక్షులు, పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రెసిబిటరీ ఇన్‌చార్జి ఆండ్రూస్‌ ప్రేమ్‌సుకుమార్‌, రోలాండ్‌,జాన్‌వెస్లీ, శాంతికుమార్‌, సునీల్‌, జోసెఫ్‌, సుమాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-19T07:19:05+05:30 IST