అంబులెన్స్ ఏర్పాటుతో రోగులకు ప్రయోజనం
ABN , First Publish Date - 2020-12-31T05:13:54+05:30 IST
ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌ను ఏర్పాటుతో రోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్
జహీరాబాద్, డిసెంబరు 30 : ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌ను ఏర్పాటుతో రోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో సఫైబేతుల్‌మాల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సఫైబేతుల్‌మాల్ సంస్థ సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సఫైబేతుల్‌మాల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.