బ్యాంకు సేవలు 4 గంటలే
ABN , First Publish Date - 2020-03-24T06:33:19+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతను చూపుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు పనిగంటలను తగ్గించాయి. ఇతర రంగాల మాదిరిగానే బ్యాంకింగ్ రంగం కూడా...

మెదక్ అర్బన్, మార్చి 23: కరోనా వైరస్ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతను చూపుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు పనిగంటలను తగ్గించాయి. ఇతర రంగాల మాదిరిగానే బ్యాంకింగ్ రంగం కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆర్యోగం కోసం పనిగంటలను మార్చాయి. రోజుకు కేవలం 4 గంటలే పనిచేయనున్నాయు. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ఖాతాదారులను కోరుతున్నాయి. బ్యాంకులు డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా తగ్గిస్తున్నాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుడడం ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
31 దాకా మధ్యాహ్నం 2 గంటల వరకే
బ్యాంకులు పనివేళల్లో మార్పులు చేశాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసిన బ్యాంకులు ఇకపై నాలుగు గంటలే పని చేయనున్నాయి. ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పని చేయనున్నారు. 31 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని ఎస్‌బీఐ, ఆంరఽధబ్యాంక్ అధికారులు తెలిపారు. ఖాతాదారులు సహకరించాలని వారు కోరారు.