చెట్లను నరికిన వ్యక్తుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-03-12T08:11:26+05:30 IST

సిద్దిపేటలోని ఓ గార్డెన్‌ పరిధిలో ఈనెల 3న చెట్లను నరికిన వ్యక్తులను టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మున్సిపాలిటీ అధికారులకు

చెట్లను నరికిన వ్యక్తుల అరెస్ట్‌

సిద్దిపేట క్రైం, మార్చి11: సిద్దిపేటలోని ఓ గార్డెన్‌ పరిధిలో ఈనెల 3న చెట్లను నరికిన వ్యక్తులను టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ పరశురాం ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన లీడ్‌స్పేస్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ భరత్‌చంద్రారెడ్డి ఆదేశానుసారం జనగామకు చెందిన లేబర్లు బుక్య రవీందర్‌ రెడ్డి, శేఖర్‌, బుక్య సందీప్‌ రెడ్డి, చెట్లను నరికినట్లు టూ టౌన్‌ సీఐ పరశురాం తెలిపారు. భరత్‌చంద్రారెడ్డితో పాటు ముగ్గురు లేబర్లను రిమాండ్‌ తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బందిని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌ అభినందించారు.

Updated Date - 2020-03-12T08:11:26+05:30 IST