మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ సంబురాలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెదక్‌ ఖేథడ్రల్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలకు మహా ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ సంబురాలకు ఏర్పాట్లు
భక్తులతో నిండిపోయిన ప్రత్యేక ప్రార్థనా మందిరం


పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టిన మెదక్‌ చర్చి కమిటీ

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు


మెదక్‌ కల్చరల్‌, డిసెంబరు 20: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెదక్‌ ఖేథడ్రల్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలకు మహా ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రవేశద్వారం వద్ద గల గుమ్మానికి సున్నం వేశారు. చర్చి ఆవరణలో ట్రాక్టర్‌లతో శుభ్రం చేయిస్తున్నారు. భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కాగా ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. క్రిస్మస్‌ సమీపిస్తున్నందున బిషప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో చర్చిలోని ప్రత్యేక ప్రార్థన మందిరం భక్తులతో కిక్కిరిసిపోయింది. చర్చి ఆవరణలో దుకాణ సముదాయాలను ఏర్పాటు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST