పద్మభూషణ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-06-18T11:09:19+05:30 IST
జిల్లాలోని వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రధానం
సంగారెడ్డి రూరల్, జూన్ 17: జిల్లాలోని వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రధానం చేయనున్నట్లు యువజన, క్రీడల జిల్లా అధికారి రామచంద్రారావు ప్రకటనలో తెలిపారు. ఆయా రంగాల్లో సేవలందించిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన వారికి 2021 జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి అవార్డులను అందజేస్తారని చెప్పారు. జిల్లాలో కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ ఇతర రంగాల్లో సాధించిన లక్ష్యాలను, చేసిన కృషిని 800 పదాలకు మించకుండా ఈ నెల 20వ తేదీలోగా సంగారెడ్డి కలెక్టరేట్‌లోని యువజన, క్రీడల కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు.