రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-15T05:44:12+05:30 IST
నంగునూరు, డిసెంబరు 14 : రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ మూడు చట్టాలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల సమావేశం లో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
నంగునూరు, డిసెంబరు 14 : రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ మూడు చట్టాలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల సమావేశం లో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం నంగునూరు ఎంపీపీ జాప అరుణదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రంగనాయసాగర్ సాగునీటి కాలువలో భూములు కోల్పోయిన రైతులు మిగులు భూమికి సంబంధించి రైతుబంధు డబ్బులు రావడం లేదని, అవి వచ్చేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. మండలానికి డబుల్ రోడ్డు మంజూరు చేయడంపై ప్రభుత్వానికి ఎంపీటీసీలు, సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ఉమావెంకటరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు బద్దిపడగ కిష్టారెడ్డి, నంగునూరు సహకార సంఘం చైర్మన్ కోల రమే్‌షగౌడ్, పాలమాకుల సహకార సంఘం చైర్మన్ ఎల్లంకి మైపాల్‌రెడ్డి, ఎంపీడీవో మధుసూదన్, ఎంఈవో దేశిరెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రాధిక, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.