నీటి కుంటలో పడి మరో యువకుడు మృతి
ABN , First Publish Date - 2020-11-27T05:28:21+05:30 IST
చేపలు పడుతుండగా కాళ్లకు, చేతులకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతి చెందాడు.

నంగునూరు, నవంబరు 26: వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు(17) బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న కుంటలో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పడుతుండగా కాళ్లకు, చేతులకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతి చెందాడు. తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు రాజగోపాల్‌పేట ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.