డంపుయార్డులను ఉపయోగించుకోవాలి
ABN , First Publish Date - 2020-07-08T11:46:56+05:30 IST
డంపుయార్డులను ఉపయోగంలోకి తెచ్చుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అడిషనల్ కలెక్టర్ ముజామిల్‌ఖాన్‌అన్నారు.
సిద్దిపేట అర్బన్, జూలై 7: డంపుయార్డులను ఉపయోగంలోకి తెచ్చుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అడిషనల్ కలెక్టర్ ముజామిల్‌ఖాన్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండల ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు డంపుయార్డు, వర్మికంపోస్టుపై మంగళవారం మిట్టపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ముజామిల్‌ఖాన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురే్‌షబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, ఎంపీపీ సవిత, సర్పంచ్‌లక్ష్మి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఎంపీవో వేదవతి, పీఏసీఎస్ చైర్మన్‌శ్రీనివాస్, ఉప సర్పంచ్ సంతోష్, కార్యదర్శి రాజ్‌కుమార్, మండల సర్పంచుల ఫోరం కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.
రాయపోల్: రాయపోల్‌లో సర్కార్ తోటకు సంబంధించి సుమారు 20 ఎకరాల భూమిపై వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతున్నది. మంగళవారం అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆ భూమిని పరిశీలించా రు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి వివరాలను సేకరించారు.