‘ధరణి’ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-13T09:53:43+05:30 IST

మండలంలోని తహసీల్దార్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధరణి పోర్టల్‌తో పాటు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న ప్రతి భూమి

‘ధరణి’ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ఝరాసంగం, నవంబరు 12 : మండలంలోని తహసీల్దార్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధరణి పోర్టల్‌తో పాటు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న ప్రతి భూమి కొనుగోలు దారుడికి వెంటనే రిజిస్ర్టేషన్‌ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతుకు పట్టాదారు పాస్‌ పుస్తకం అందజేశారు. అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. బర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్నారు. బర్దీపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖమణి అవదూత గిరి మహరాజ్‌ శాలువా, పూలమాలతో సన్మానించారు. ఆయన వెంట తహసీల్దార్‌ తారాసింగ్‌, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-11-13T09:53:43+05:30 IST