అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు

ABN , First Publish Date - 2020-03-18T11:43:52+05:30 IST

అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా మీడియా అక్రెడిటేషన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు

అక్రెడిటేషన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ అర్బన్‌, మార్చి17: అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా మీడియా అక్రెడిటేషన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులను అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఆర్వోకు కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీనివా్‌సరెడ్డి, మధువన్‌, సంగమేశ్వర్‌, బిక్షపతి, జానకీరాం, ఫారుఖ్‌హూస్సేన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T11:43:52+05:30 IST