రైస్‌ డెలివరీని వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-15T05:58:23+05:30 IST

కస్టం మిల్లింగ్‌ రైస్‌ డెలివరీని వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పౌర సరఫరాల కార్పొరేషన్‌కి చేర్చాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైస్‌ డెలివరీని వేగవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

రైస్‌ మిల్లర్లకు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ఆదేశం


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 14 : కస్టం మిల్లింగ్‌ రైస్‌ డెలివరీని వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పౌర సరఫరాల కార్పొరేషన్‌కి చేర్చాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి ప్రతి రోజూ రైస్‌ మిల్లర్లు 7,290 క్వింటాళ్ల కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కి డెలివరీ చేయాలని, ఫిబ్రవరి 28లోగా మొత్తం కస్టం మిల్లింగ్‌ రైస్‌ను గోదాములకు చేర్చాలని ఆదేశించారు. రైస్‌ మిల్లర్లు తమ వద్ద మిగిలిన అన్ని గోనె సంచులను లెక్కతో సహా పౌర సరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌కు అందజేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఎ్‌సవో శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ సుగుణభాయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T05:58:23+05:30 IST