జిల్లాలో 83.5 శాతం పోలింగ్‌

ABN , First Publish Date - 2020-02-16T06:31:17+05:30 IST

జిల్లాలో 83.5 శాతం పోలింగ్‌

జిల్లాలో 83.5 శాతం పోలింగ్‌

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 15 :  జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలు శనివారం నాడు చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల్లో 83.5 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలోని 53 వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో 689 డైరెక్టర్‌ (ప్రాదేశిక నియోజకవర్గాలు) స్థానాలుండగా 282 స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. మిగిలిన 427 స్థానాల్లో  ఎస్‌టిలకు రిజర్వేషన్‌ 10 స్థానాల్లో ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో వాటికి ఎన్నికలు జరగలేవు మిగిలిన 417 ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 417 డైరెక్టర్‌ స్థానాల పరిధిలో 36,720 మంది ఓటర్లకుగాను 30,663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 53 పీఏసీఎ్‌సలలో 8 పీఏసీఎ్‌సలు ఏకగ్రీవం కాగా 43 పీఏసీఎ్‌సల పరిధిలోని 417 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్‌ సర్కిల్‌ పరిధిలోని కల్హేర్‌ మండలం బాచేపల్లి పీఎసీఎ్‌సలో రెండు వేర్వేరు స్థానాల్లో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో టాస్‌ వేసి అభ్యర్థులను ఖరారు చేశారు. 


పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు నిల్‌ 

సహకార సంఘాల ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక ఓట్లు ఇబ్బందుల పాలయ్యారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీసం తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇక్కట్ల పాలయ్యారు. వృద్ధులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయలేదనే విమర్శలున్నాయి.

Updated Date - 2020-02-16T06:31:17+05:30 IST