అనాథాశ్రమంలో 8 గంటల పాటు విచారణ

ABN , First Publish Date - 2020-08-18T10:08:28+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన అమీన్‌పూర్‌ మారుతి ఆశ్రమంలో బాలికపై అత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం ..

అనాథాశ్రమంలో 8 గంటల పాటు విచారణ

 పోలీసు కస్టడీకి అమీన్‌పూర్‌ అత్యాచార నిందితులు


పటాన్‌చెరు, ఆగస్టు 17 : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన అమీన్‌పూర్‌ మారుతి ఆశ్రమంలో బాలికపై అత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంగారెడ్డి న్యాయస్థానం అనుమతితో సోమవారం ఉదయం నిందితులను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి, అతడికి సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకులు విజయ, జయదీ్‌పను కందిలోని జిల్లా జైలు నుంచి నేరుగా పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలను నిర్వహించారు. అనంతరం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ హెచ్‌ఎంటీ వెదిరి కాలనీలోని మారుతి అనాథశ్రమానికి తీసుకెళ్లారు. నిందితులను సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు విచారించారు. కేసు దర్యాప్తు అధికారిగా నియమితులైన పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. బాలికపై ఏడాది కాలంలో పలుమార్లు అత్యాచారం జరిగిందని భావిస్తున్న ఐదో అంతస్తులోని గదిలో విచారణ కొనసాగించినట్లు తెలిసింది. సాయంత్రం ఎస్పీ చంధ్రశేఖర్‌రెడ్డి విచారణలో పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమంలో పనిచేస్తున్న నలురురు ఆయాలను సైతం ప్రశ్నించినట్లు  సమాచారం.


ఆశ్రమంలో ఉన్న మిగతా బాలికలను సైతం లైంగికంగా ఇబ్బందులకు గురి చేశారా అన్న కోణంలో విచారణ సాగినట్లు తెలిసింది. దీనిపై ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభ్యం కానప్పటికి మరింత లోతుగా పోలీసులు విచారణను నిర్వహించనున్నారు. విచారణ మొత్తం వీడియోలో నిక్షిప్తం చేశారని తెలిసింది. సేకరించిన ఆధారాలను హైపవర్‌ కమిటీకి అందజేయనున్నారు. పలు సంస్థల నుంచి సేకరించిన విరాళాలు, ఆడిట్‌ నివేదికలను, సీసీ టీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమ బ్యాకు ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్నారు.ఆశ్రమానికి వచ్చే పెద్దలు ఎవరు, వారితో నిర్వహకురాలికి ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఆశ్రమానికి వేణుగోపాల్‌రెడ్డి వచ్చిన ప్రతి సందర్భంలో డైరీల్లో ఆయన స్పాన్సర్‌ చేస్తున్న భోజన వివరాలను పొందుపరిచి ఉన్నాయి. డైరీలోని తేదీల ఆధారంగా సీసీ టీవీ ఫుటేజీలను సాక్ష్యాలుగా సేకరిస్తున్నారు. సేవ ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిర్వహకుల వెనుక కొందరు పెద్దమనుషుల హస్తం ఉందన్న ప్రచారం సాగుతోంది. పలు పరిశ్రమల నుంచి సీఎ్‌సఆర్‌ నిధులను ఆశ్రమానికి దారిమళ్లించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అనాథశ్రమం రంగారెడ్డి జిల్లా పరిఽధిలో నిర్వహించేందుకు అనుమతి ఉండగా సంగారెడ్డి జిల్లా పరిధిలో మూడేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఈ విషయం స్థానిక అధికారులెవరికి తెలియకపోవడం గమనార్హం. స్థానిక ఐసీడీఎస్‌ అధికారులకు, బాలల హక్కుల పరిరక్షణ అధికారులకు, రెవెన్యూ, పోలీసు విభాగాలకు అక్రమ ఆశ్రమం వైపు కన్నెత్తి చూడకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-08-18T10:08:28+05:30 IST