జిల్లాలో కొత్తగా 5 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-13T09:50:31+05:30 IST
జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో 5 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు
మెదక్ అర్బన్, నవంబరు 12: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో 5 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మెదక్ టౌన్‌లో 3, నర్సాపూర్, రేగోడ్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్టు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,181కు చేరింది.