జిల్లాలో 277 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-12T09:53:40+05:30 IST

జిల్లాలో శుక్రవారం 277 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 164 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 66,

జిల్లాలో 277 కరోనా పాజిటివ్‌ కేసులు

సిద్దిపేట, సెప్టెంబరు 11: జిల్లాలో శుక్రవారం 277 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 164 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 66, హుస్నాబాద్‌ డివిజన్‌లో 37 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో.. సిద్దిపేటలో గొంతుస్రావాల ద్వారా 24, చేర్యాల సీహెచ్‌సీలో 10, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 9, ఇబ్రహీంనగర్‌లో 4, దౌల్తాబాద్‌లో 5, ఇందుప్రియాల్‌లో 2, దుబ్బాక సీహెచ్‌సీలో 12, పీహెచ్‌సీల వారీగా రామక్కపేటలో 4, తిమ్మాపూర్‌లో 5, కొమురవెల్లిలో 2, మిరుదొడ్డిలో 9, భూంపల్లిలో 8, రాజగోపాల్‌పేటలో 4, నంగునూరులో 6, నారాయణరావుపేటలో 4, పుల్లూరులో 14, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 15, అంబేడ్కర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 24, తొగుటలో 3,  గజ్వేల్‌ డివిజన్‌లో.. పీహెచ్‌సీల వారీగా సిరిగిరిపల్లిలో 16, జగదేవ్‌పూర్‌లో 6, తిగుల్‌లో 3, కొండపాకలో 3, కుకునూరుపల్లిలో 5, మర్కుక్‌లో 2, ములుగు, సింగన్నగూడెంలో 9, రాయపోల్‌లో 8, వర్గల్‌లో 14, హుస్నాబాద్‌ డివిజన్‌లో.. పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేటలో 7, బెజ్జంకిలో 2, తోటపల్లిలో 3, హుస్నాబాద్‌లో 13, కోహెడలో 7, మద్దూరులో 5 కేసులొచ్చాయి.


నెలాఖరు వరకు మల్లన్న దర్శనం నిలిపివేయాలి

చేర్యాల: కరోనా వ్యాధి తీవ్ర తరమవుతున్న నేపథ ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ దర్శనాన్ని ఈనెల 30వరకు నిలిపివేయాలని గ్రామపంచాయతీలో తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని శుక్రవారం ఆలయాధికారులకు అందించారు. కేసులు పెరుగుతుండడంతో ఇటీవలే మల్లన్న దర్శనాన్ని ఆలయాధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా కేశఖండన నిలుపుదలకు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-09-12T09:53:40+05:30 IST