రూ.6వేల పింఛన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-28T04:57:07+05:30 IST

చేర్యాల, డిసెంబరు 27 : బీడీ కార్మికులకు కనీస వేతనంగా రూ.6వేల పింఛ న్‌ ఇవ్వాలని ఏఐటీయూసీరాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ యూసుఫ్‌ కోరారు

రూ.6వేల పింఛన్‌ ఇవ్వాలి

 ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ యూసుఫ్‌

చేర్యాల, డిసెంబరు 27 : బీడీ కార్మికులకు కనీస వేతనంగా రూ.6వేల పింఛ న్‌ ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ యూసుఫ్‌ కోరారు. చేర్యాలలోని షాదీఖానాలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రకళామందిర్‌ నుంచి షాదీఖానా వరకు బీడీకార్మికులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం సభలో ఆయన మాట్లాడారు. బీడీ కట్టపై 85శాతం పుర్రె బొమ్మను ముద్రించడంతో పాటు జీఎస్టీ అమలుతో బీడీపరిశ్రమను సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రతీ బీడీ కార్మికురాలికి కనీస పెన్షన్‌గా రూ.10వేలు ఇవ్వాలని, పిల్లల చదువులకు ఉపకార వేతనాలను అందించాలని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధనకు బీడీకార్మికులు ఉద్యమించాలని, బీడీకార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏఐటీయూసీ పాటుపడుతుందన్నారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, బీడీవర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మచ్చ శ్రీనివాస్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిష్టపురం లక్ష్మణ్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు అందె అశోక్‌, నాయకులు ఆది రంగారెడ్డి, ఈరు భూమయ్య, కనుకుంట్ల శంకర్‌, మేకల రజిత, అంబటి అంజయ్య, వలబోజు నర్సింహాచారి, బం డారి సిద్దులు, బొజ్జ బాలకృష్ణ, గజ్జల సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:57:07+05:30 IST