రెండో రోజు పరీక్షకు 22 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2020-03-21T11:05:43+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలకు

రెండో రోజు పరీక్షకు 22 మంది గైర్హాజరు

మెదక్‌ అర్బన్‌, మార్చి 20: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలకు మొత్తం 11,479 మంది విద్యార్ధులకు గానూ 11,457 మంది హాజరుకాగా 22 మంది గైర్హాజరయ్యారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో హ్యాండ్‌వాష్‌ లిక్విడ్‌, సబ్బులను అందుబాటులో ఉంచారు. మెదక్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాల కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-03-21T11:05:43+05:30 IST