జిల్లాలో 156 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-10-07T06:57:15+05:30 IST
జిల్లాలో మంగళవారం 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 91 కేసులు, గజ్వేల్ డివిజన్‌లో 29, హుస్నాబాద్ డివిజన్‌లో 36 కేసుల చొప్పున నమోదయ్యాయి.

సిద్దిపేట, అక్టోబరు 6: జిల్లాలో మంగళవారం 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 91 కేసులు, గజ్వేల్ డివిజన్‌లో 29, హుస్నాబాద్ డివిజన్‌లో 36 కేసుల చొప్పున నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో... సిద్దిపేటలో గొంతుస్రావాల ద్వారా 13, చేర్యాల సీహెచ్‌సీలో 1, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 12, దౌల్తాబాద్‌లో 8, దుబ్బాక సీహెచ్‌సీలో 8, పీహెచ్‌సీల వారీగా కొమురవెల్లిలో 1, మిరుదొడ్డిలో 1, భూంపల్లిలో 5, రాజగోపాల్‌పేటలో 1, నంగునూరులో 6, నారాయణరావుపేటలో 7, పుల్లూరులో 11, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 7, అంబేడ్కర్‌నగర్ యూపీహెచ్‌సీలో 8, తొగుటలో 2 కేసులు నమోదయ్యాయి. గజ్వేల్ డివిజన్‌లో... గజ్వేల్ ఆస్పత్రిలో 1, పీహెచ్‌సీల వారీగా సిరిగిరిపల్లిలో 7, జగదేవ్‌పూర్‌లో 3, తిగుల్‌లో 1, కుకునూరుపల్లిలో 3, మర్కుక్‌లో 6, ములుగులో 1, రాయపోల్‌లో 3, వర్గల్‌లో 4 కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్ డివిజన్‌లో... పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేటలో 12, బెజ్జంకిలో 8, తోటపల్లిలో 3, హుస్నాబాద్‌లో 4, కోహెడలో 8, లద్నూర్‌లో ఒక కేసు నమోదయ్యింది.