కారు, బైక్ ఢీ : యువతి మృతి
ABN , First Publish Date - 2020-12-30T04:09:39+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాలపాలైన సంఘటన మంగళవారం నారా యణపేట మండలం చిన్నజట్రం సమీపంలో చోటుచేసుకుంది.
-పెళ్లి దుస్తుల కోసమని వచ్చి పరలోకానికి..
నారాయణపేట క్రైం, డిసెంబరు 29 : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాలపాలైన సంఘటన మంగళవారం నారా యణపేట మండలం చిన్నజట్రం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్ర మోహన్ తెలిపిన వివరాలు... నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ, వెంకటేష్ ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు. జనవరి 3న బం ధువుల పెళ్లి ఉన్నందున వీరిద్దరూ బైక్‌పై నారాయణపేటకువచ్చి దుస్తులు కొను గోలు చేసి తిరిగి వెళ్తుండగా చిన్నజట్రం సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వెంకటమ్మ(18) సంఘటన స్థలంలోనే మృతి చెంద గా తీవ్రగాయాలపాలైన వెంకటేష్‌ను స్థానికులు 108లో చికిత్స నిమిత్తం పేట జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. ఈ సంఘ టనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.