ర్యాండం టెస్టింగే మార్గం

ABN , First Publish Date - 2020-04-15T10:40:32+05:30 IST

కరోనా కేసుల ను తేల్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాండమ్‌ టెస్టింగ్‌ చేయించాలని భావిస్తున్నాయి.

ర్యాండం టెస్టింగే మార్గం

విదేశాలు, మర్కజ్‌ కాంటాక్ట్‌ నమూనాల పూర్తి

అయినా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

వనపర్తి, నారాయణపేటలో జీరో పాజిటివ్‌

జిల్లాలో ర్యాపిడ్‌ టెస్టింగ్‌కు సమాయత్తం

ఉమ్మడి జిల్లాలో పరీక్షల కోసం నమూనాలు


వనపర్తి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల ను తేల్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాండమ్‌ టెస్టింగ్‌ చేయించాలని భావిస్తున్నాయి. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు, హాట్‌ స్పాట్లలో ర్యాండమ్‌ పరీక్షలు చేపట్టడంతోపాటు జీరో పాజిటివ్‌ ఉన్న జిల్లా ల్లో కూడా పూల్‌ టెస్టింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, నారాయణపేట మినహా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నా యి. గద్వాల, మహబూబ్‌నగర్‌లో పాజిటివ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాలో రెడ్‌ జోన్లు ఏర్పాటు చేశారు.


ఇప్పటి వరకు పాజిటీవ్‌ వచ్చి న వారందరికీ మర్కజ్‌ కాంటాక్టులే ఉండటం.. ప్రభు త్వం ఇప్పటి వరకు సేకరించిన నమూనాలు మొత్తం పూర్తయి.. ప్రస్తుతం ఫలితాలు నాలుగుకు మించి పెండింగ్‌లో లేకపోవడం.. అయినా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల రెడ్‌ జోన్లలో ర్యాండమ్‌ టెస్టింగ్‌ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వన పర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా ప్రభావం మొదలైన ప్పటి నుంచి జిల్లాకు 58 మంది విదేశాల నుంచి రాగా అందర్నీ గుర్తించి వారిని ప్రభుత్వ, హోం క్వారంటైన్‌ చేశారు.


వారి 14 రోజుల క్వారంటైన్‌ గడువు ముగిసిం ది. ఈ నెల 21 వరకు ఇంట్లోనే ఉండాలని వారికి సూ చించారు. మర్కజ్‌ సమావేశాలకు వెళ్లిన పది మందిని గుర్తించి, పరీక్షలు చేయించగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచా రు. అలాగే ఆ పది మంది విదేశాల నుంచి వచ్చిన వారితో కాంటాక్టు ఉన్న 142 మందిని కూడా క్వారం టైన్‌ పూర్తి చేశారు. ఇందులో 61 మంది వరకు ఇళ్లల్లోనే ఉన్నా వైద్యాధికారులు పర్య వేక్షణ చేయనున్నారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన ఒకరికి కరోనా లక్షణాలు రావ డంతో గాంధీకి పంపించినా తర్వాత నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ అయ్యా రు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ జీరో పాజిటివ్‌ కావడం.. మిగతా జిల్లాల్లో చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తుండటంతో ప్రతి కాంటాక్ట్‌ను వెతికి మరీ.. పరీక్షల కోసం నమూనా లను పంపిస్తున్నారు.


జిల్లాలోని కొత్తకోట నుంచి 24, వనప ర్తి నుంచి 21, పెబ్బేరు నుంచి 18.. మొత్తం 63 నమూ నాలు సోమవారం అధికారులు పరీక్షల కోసం పంపగా అందులో 63 నమూనాలు నెగటివ్‌ వచ్చాయి. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు పరీక్షల కోసం 92 నమూనాలు పంపగా అన్నీ నెగిటివ్‌ వచ్చాయి. అయితే ఇదే తరహా పరీక్షలను ఇకముందు కూడా కొనసాగిం చాలని అధికారులు భావిస్తున్నారు. జీరో కేసులు ఉన్నా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 274 నమూనాలను పరీక్షల కోసం పంపగా 265 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇందులో మర్కజ్‌, విదేశాల నుంచి వచ్చిన వారి కాం టాక్ట్‌లను దాదాపు ట్రేస్‌ చేయగా.. అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇకమీదట ర్యాండమ్‌ పరీక్షలు ఇక్కడ కూడా చేయడం అనివార్యం కానుంది.


కొందరు కాంటాక్ట్‌లను దాచి పెట్టడం, లక్షణాలు ఉన్నా బయట తిరగడం లాంటివి చేస్తుండటం వల్ల పూల్‌ టెస్టింగ్‌ విధానం మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అవసరం అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగకు న్నప్పటికీ భవిష్యత్‌లో లాక్‌డౌన్‌ సడలింపు చేపట్టాలన్నా విరివిగా పరీక్షలు చేసి.. సమస్య తీవ్రతను గుర్తించడం తప్పా వేరే మార్గం లేదనే అభిప్రాయం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇప్పటి వరకు 194 మంది నమూనాలను కరోనా పరీక్షల కోసం పంపగా అందులో 16 మందికి పాజిటీవ్‌ వచ్చింది. 174 మందికి నెగిటివ్‌ వచ్చింది.


మరో నాలుగు నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఈ నాలుగు నమూనాలు ఫలితాలు కూడా వస్తే.. రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో కూడా ర్యాండమ్‌ శాంపిళ్లు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇక నారాయణపేట జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కానందున పూల్‌ టెస్టింగ్‌ చేపట్టే అవకాశం ఎక్కువగా ఉండనుంది. 

Updated Date - 2020-04-15T10:40:32+05:30 IST