యాసంగికి ‘సాగర్‌’ నీరు

ABN , First Publish Date - 2020-12-11T04:00:11+05:30 IST

ఖరీఫ్‌లో వెసిన పంటలు చెతికొచ్చే సమ యంలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతన్న యాసంగికి సిద్ధం అవుతు న్నాడు.

యాసంగికి ‘సాగర్‌’ నీరు
ఆయకట్టుటలో నాటువేసేందుకు నారుమడి వేస్తున్న రైతు

- రేపు కోయిల్‌సాగర్‌ నీరు విడుదల

- ఊపందుకున్న యాసంగి పనులు


దేవరకద్ర, డిసెంబరు 10 : ఖరీఫ్‌లో వెసిన పంటలు చెతికొచ్చే సమ యంలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతన్న యాసంగికి సిద్ధం అవుతు న్నాడు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు ఉండటంతో పాటు గతంలో కన్న భూగర్భజలాలు పెరగడంతో రైతులు యాసంగి పనులకు సిద్ధం చేసుకుని వరినాట్లు వేసుకుంటున్నారు. మండలంలోని కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఉన్న దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్‌ మండలాల్లోని కుడి, ఎడమ కాల్వాల నుంచి 35వేల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తామని చెప్పినప్పటికీ, ప్రాజెక్టులోని నీటిని తాగు కు, సాగుకు కేటాయించారు.  కాల్వల కింద సాగు చెసుకున్న రైతులకు దాదాపు 12వేల ఎకరాలకు మొదట నాలుగు విడతలుగా  ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుదారులు యాసంగి పనులను ముమ్మరం చేశారు. ఈ నెల 12 నుంచి నీటిని విడుదల చేయనుండటంతో రైతులు విత్తనాలను, ఎరు వులను సిద్ధం చేసుకొన్నారు. నీటి విడుదల తరువాయి వెంటనే కూలీల సాయంతో నాట్లు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.


నాలుగు విడతల్లో సాగునీరు 


ప్రాజెక్టులో మొత్తం 2.24 టీఎంసీల నీరు ఉంది.  దీంతో యాసంగిలో ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లోని ఆయకుట్టుకు కుడి, ఎడమకాల్వల ద్వారా సాగునీటిని ఈ నెల 12 నుంచి విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రక టించారు. ప్రాజెక్టు నుంచి ఒక్కో విడతను 12 రోజుల పాటు నీటిని విడుదల చేసి మరో 13 రోజుల పాటు నీటిని నిలి పివేసేలా ప్రణా ళికలు రూపొం దించారు. ప్రణా ళిక ప్రకారం నా లుగు విడతల్లో నీటిని అందించడా నికి ప్రణాళికలో రూ పొందించారు. 


ఐదు విడతల్లో నీటిని అందించాలి


కోయిలసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని యాసంగి పంటలకు 5 విడతల్లో అందించాలి. 4 విడతల్లో నీటిని అందించి నీటిని నిలిపివేస్తే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అధికారులు స్పందించి 5 విడతల్లో నీటిని అందించి ఆదుకోవాలి.

- వెంకటేష్‌, రైతు


ప్రణాళిక ప్రకారం నీటిని అందిస్తాం


 కోయిలసాగర్‌ ప్రాజెక్టు ద్వారా యాసంగికి పంటకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రణాళికల ప్రకారం నీటిని అందించేలా చర్యలు తీసుకుంటాం. 

- రవీందర్‌ రెడ్డి, ప్రాజెక్టు డీఈ  

Updated Date - 2020-12-11T04:00:11+05:30 IST