-
-
Home » Telangana » Mahbubnagar » world
-
ప్రపంచ మేధావి అంబేడ్కర్
ABN , First Publish Date - 2020-12-07T04:19:23+05:30 IST
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి,
మాజీ మంత్రి చిన్నారెడ్డి
జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ వర్ధంతి
వనపర్తిఅర్బన్/టౌన్/పెబ్బేరు/వీపనగండ్ల/ కొత్తకోట/మదనాపురం/ఆత్మకూరు/పెద్దమందడి/పాన్‌గల్, డిసెంబరు 6: ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. అంబేడ్కర్ 64వ వ ర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వి గ్రహానికి నివాళులు అర్పించారు. సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ అని బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాయకులు రాంమోహన్, పెద్దిరాజు, తిరుమలేష్, రాములు, శ్రీనివాస్‌గౌడ్, కి రణ్‌కుమార్, తిరుపతయ్య, బాబా, అబ్దుల్లా, రా ధాకృష్ణ, కురుమయ్య, మహారాజ్, రత్నయ్య, తిరుప తయ్య, ఎలిషా, మధు పాల్గొన్నారు.
- పెబ్బేరుమునిసిపల్ కార్యాలయంలో చైర్‌ప ర్సన్ కరుణశ్రీ, జడ్పీటీసీ సభ్యురాలు పద్మవెంకటేష్, ఎంపీపీ శైలజ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, మునిసిపల్ వైస్‌చైర్మన్ కర్రెస్వామి, కమిషనర్ జా న్ కృపాకర్ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి నివా ళులర్పించారు. అనంతరం పారిశుధ్యకార్మికులకు స్వెటర్లను పంపిణీ చేశారు. కొల్లాపూర్ చౌరస్తాలో ని అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు శ్రీని వాస్‌గౌడ్, గోపీబాబు, భగవంతుయాదవ్, టీఆర్ ఎస్ నాయకులు బుచ్చారెడ్డి, ఐజాక్, ఎల్లయ్య, సా యినాథ్, ముస్తాక్, నాయకులు రాజశేఖర్, గడ్డం బాలస్వామి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు శివశంకర్ పాల్గొన్నారు.
- వీపనగండ్లలో ఎమ్మార్పీఎస్, తెలంగాణ వ్య వసాయ కార్మికసంఘం, కేవీపీఎస్, అంబేడ్కర్ సం ఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్రప టాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- కొత్తకోట, పాలెం, కనిమెట్ట, రామనంత పూర్, పామపురం, సంకిరెడ్డిపల్లి, వడ్డెవాట గ్రామా ల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో వామన్‌గౌడ్, మౌనిక, సుఖేశిని, భరత్ భూ షణ్, వెంకట్‌రెడ్డి, ప్రశాంత్, మేస్త్రీ శ్రీను, బోయోజ్, కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, కొండారెడ్డి, రాములు యా దవ్, ఇజ్రాయిల్ పాల్గొన్నారు.
- పాన్‌గల్, కేతేపల్లి, రేమద్దుల, జమ్మాపూర్, దొండాయిపల్లి తదితర గ్రామాల్లో అంబేడ్కర్ వ ర్ధంతి నిర్వహించారు. మండల కేంద్రంలో అంబే డ్కర్ విగ్రహానికి మాజీ జడ్పీటీసీ సభ్యుడు రవికు మార్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
- మదనాపురం మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచు రాంనారా యణ, వెంకట్‌నారాయణ, జగదీష్, మహేష్‌కు మార్, వడ్డె బాలస్వామి, నాగేంద్రము పాల్గొన్నారు.
- ఆత్మకూర్, పెద్దమందడి, మండలాల్లో అం బేడ్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, స్వేరోస్ కమిటీ సభ్యులు పూ లమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆత్మకూరు లో మునిసిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవికుమా ర్, పెద్దమందడి సింగిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.