ఉపాధిపై కరోనా పోటు

ABN , First Publish Date - 2020-04-15T10:38:53+05:30 IST

అసలే అంతంత మాత్రంగా సాగుతున్న ఉపాధి హామీ పనులపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది.

ఉపాధిపై కరోనా పోటు

‘ఉపాధి’ పట్ల ఆసక్తి చూపని కూలీలు

సర్పంచ్‌లు ఒత్తిడి చేస్తున్నా కదలని జనం

జిల్లాలో 18,570 మంది ముందుకు..

సోమవారం 437 గ్రామాల్లో ప్రారంభం

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైనం

వారం రోజుల్లో ఆరు వేలు పెరిగిన కూలీలు

5 నుంచి 6 మండలాల్లో కాస్త బెటర్‌

లాక్‌డౌన్‌ తరువాతే పరిస్థితిలో మార్పు


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 14: అసలే అంతంత మాత్రంగా సాగుతున్న ఉపాధి హామీ పనులపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో పెద్దఎత్తున ఉపాధి హామీ పనులు జరిగేవి. ఈ మూడు, నాలుగు నెలల్లోనే దాదాపుగా పనులన్నింటినీ పూర్తి చేసేవారు. ఈ సీజన్‌లో ఒక్కో గ్రామంలో పనులకు వెళ్లేవారు జాత రలా కనిపించేవారు. జిల్లా అంతటా ప్రతిరోజూ లక్ష కుపైగా కూలీలు పనులు చేసే పరిస్థితి ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా మారింది.


ఒక్కో గ్రామంలో అతికష్టంగా పదుల సంఖ్యలోనే కూలీలు పనులకు వెళుతున్నారు. సర్పం చ్‌లు, గ్రామ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తే అతికష్టంగా ఈ వారం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. గతనెల 30 జిల్లాల్లో 7,708 మంది పనులు చేపట్టగా గత సోమవారం 12,493 మంది పనులకు హాజర య్యారు. తాజాగా మంగళవారం 18,570 మంది హా జరు కావడంతో స్లోగా పనులు పుంజుకుంటున్నాయి.


పనుల దగ్గర భౌతిక దూరం: కరోనా ప్రభావం కారణంగా పనులు చేపట్టే దగ్గర కూలీల మధ్య భౌతిక దూరం ఉండేలా పనులు చేయిస్తున్నారు. హన్వాడ మండలంలో సర్పంచ్‌లు, సెక్రటరీలు పట్టుబట్టి ఒక్కో గ్రామంలో పది, పది హేను మంది చేత పనులు చేయిస్తున్నారు. కందకా లు తీసే పనులు మొదలు పెట్టి కూలీలకు కొలతలు చూయించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. గుంపులుగా కాకుండా విడివిడిగా పనులు చేయిస్తున్నారు. ఒండ్రు మట్టి పనులకు గుం పులుగా వస్తారని హరితహారంలో గుంతలు తవ్వ డం, నాటిన మొక్కలకు నీళ్లు పోయడం, కందకాలు తవ్వ డం వంటి పనులకు ప్రాధా న్యం ఇస్తున్నారు. 


కరోనాతో ఇంటి పట్టునే జనం

కరోనాతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. జనం ఇళ్ల నుంచి బయట కు రావొద్దని పెద్దఎత్తున ప్రచారం కల్పించ డంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు ఉపాధి పనులకు రావాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నా జనం మాత్రం బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. వయ సు పైబడిన వారు పనులకు వెళ్లేందుకు భయపడు తున్నారు. తప్పనిసరి అనుకున్నవారు మాత్రమే పను లకు వెళుతున్నారు. కూలీ రేటు పెరగడం, వేస విలో 30 శాతం అధిక డబ్బులు ఇస్తున్నా కూలీలు మాత్రం పనుల పట్ల ఆసక్తి చూడడం లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివే స్తే మే నెలలో పనులు పుంజుకునే అవకాశం ఉంది. 


కొన్ని మండలాల్లో పరవాలేదు. 

జిల్లాలో సగం వరకు మండలాల్లో ఓ మోస్తరుగా కూలీలు వస్తుండగా మరికొన్ని మండ లాల్లో నామ మాత్రంగానే పనులు సాగుతున్నాయి. సీసీకుంట మండలంలో 22  గ్రామపంచాయతీలు ఉండగా 2201 మంది పనులకు వస్తున్నారు. ఒక్కో గ్రామంలో సగటున 100 మంది వరకు పని చేస్తున్నారు. గండీడ్‌ మండలంలో 2146 మంది, మహబూబ్‌నగర్‌ మండలంలో 2239, నవాబ్‌పేటలో 1661, హన్వాడలో 1648, కోయిలకొం డలో 1218, జడ్చర్లలో 1129, బాలనగర్‌లో 1029, మిడ్జిల్‌లో 1004 మంది పనుల కు హాజరరయ్యారు. మిగతా మండలాల్లో గ్రామానికి 10-15 మంది మాత్రమే పనులకు వెళుతున్నారు. 


Updated Date - 2020-04-15T10:38:53+05:30 IST