వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం

ABN , First Publish Date - 2020-05-29T11:00:13+05:30 IST

దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి చూపిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం

మంత్రి నిరంజన్‌రెడ్డి


వనపర్తి అర్బన్‌, మే 28: దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి చూపిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వానాకాలం పంటలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను రాజు చేయడమే కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. నవీన పద్ధతిలో పంటలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుం దన్నారు. వెదవలు, సన్నాసులు మాట్లాడితే మాట్లాడి, సమయం వృథా చేసుకోవద్దని తెలిపారు. దేశంలోనే ఈ ఏడాది అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కి ప్రతి ఒక్క దానిపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల వారితో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని పనులు చేసుకొనే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. రైతు సమన్వయ బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు కోఆర్డినేటర్లు గ్రామాల్లో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారా యణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ నిజాం భాష, కలెక్టర్‌ యాస్మిన్‌ భాష, జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


నారాయణపేటలో దాల్‌ మిల్‌

నారాయణపేట టౌన్‌: సివిల్‌ సఫ్లై ఆధ్వర్యంలో నారాయణపేటలో దాల్‌ మిల్‌ ఏర్పాటుకు సహక రిస్తానని, డ్రిప్‌, స్ల్పింకర్లకు రాబోయే రోజుల్లో బడ్జెట్‌ కేటాయిస్తే ఉమ్మడి జిల్లాలో పేటకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి సి.ని రంజన్‌రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. నారాయణపేట ప్రాంతానికి సాగునీటిని అందించి తీరుతామని చె ప్పారు. ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులకు ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రైతు బందు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని అన్నారు. ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో కలెక్టర్‌ హరిచందన, జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ, వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖ, రైతు బంధు జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరిత, డీసీసీబీ చైర్మన్‌ చిట్యాల నిజాం పాషా, ఏఎంసీ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు, జడ్పీటీసీలు, ఎంపీపీ, డీఆర్‌డీఓ కాళిందిని, డీఏఓ జాన్‌సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:00:13+05:30 IST