సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2020-08-11T10:41:16+05:30 IST

ప్రజాసేవా, సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దెలా బీజేపీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ

సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన


నారాయణపేట టౌన్‌, ఆగస్టు 10 : ప్రజాసేవా, సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దెలా బీజేపీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా, నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్‌ ర్యాలీలో నడ్డా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు కార్యాలయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో జిల్లా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యాలయాలను ప్రజాసేవా, సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. కార్యయక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావ్‌, నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌వర్ధన్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సత్యయాదవ్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ శ్యాంసుందర్‌, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:41:16+05:30 IST