సాగునీటి కోసం కృషి చేస్తున్నాం
ABN , First Publish Date - 2020-02-08T10:35:28+05:30 IST
జూరాల చివరి ఆయకట్టు పొలాలకు సాగు నీరందించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.

- కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
చిన్నంబావి: జూరాల చివరి ఆయకట్టు పొలాలకు సాగు నీరందించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మండల ప రిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీరం మా ట్లాడారు. సింగోటం జలాశయం నుంచి గోపల్‌దిన్నె జలాశయం వరకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయడం కోసం మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి సీఎం దృష్ఠికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఎత్తిపోతల పథకాలలో ప్రస్తుతం ఒక్క మోటర్ రన్ అవుతోందని మిగతావి కూడా పనిచేసేలా చర్యలు చేపడుతున్నామ న్నారు. శ్రీశైలం నిర్వాసితుల కుటుంబాలను ఆదుకునే విధంగా సీఎం కేసీ ఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తు న్నామని అభివృద్ది పనులు చూసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓర్వ లేక టీఆర్‌ఎస్‌లో చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎం పీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట్రామమ్మ, పెద్దమారుర్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, నాయకులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.