రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , First Publish Date - 2020-12-30T03:56:59+05:30 IST
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగ సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వెల్దండ/కల్వకుర్తి అర్బన్, డిసెంబరు 29 : దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగ సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండ మండలం కొట్ర, కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ బాలాజీసింగ్, కలెక్టర్ ఎల్, శర్మన్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు విజితారెడ్డి, భరత్‌ప్రసాద్, ఎంపీపీలు విజయ, సునీ త, కల్వకుర్తి మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, నాయకులు షాహేద్, బాలయ్య, శాంతి, రాములు, భూపతిరెడ్డి, విజయ్ గౌడ్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాలలో పల్లె ప్రకృతివనం, సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశాన వాటికలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కలెక్టర్ శర్మన్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూ ర్ బాలజీసింగ్, మార్చాల సర్పంచ్ మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.