-
-
Home » Telangana » Mahbubnagar » water release varabandi scheme
-
వారబందీ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-28T02:02:11+05:30 IST
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌కు వారబందీ మాదిరిగా నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ నారాయణ తెలిపారు.

ఆత్మకూర్, డిసెంబరు 27: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌కు వారబందీ మాదిరిగా నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ నారాయణ తెలిపారు. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చిన కారణంగా వారం రోజులుగా నిరంతరాయంగా నీటి విడుదల చేశామన్నారు. సోమవారం నుంచి 4 రోజుల పాటు విడుదల చేసి శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు నీటి విడుదల నిలిపి వేస్తామని, రైతులు పొదుపుగా నీటిని వాడుకోవాలని కోరారు.