వద్దన్నా వినలే..

ABN , First Publish Date - 2020-07-08T11:21:01+05:30 IST

వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట, రేవల్లి, చిన్నంబావి మండలాల్లో రైతులు మొక్కజొన్న సాగు పట్ల అంత ఆసక్తి చూపుతున్నారు.

వద్దన్నా వినలే..

జిల్లాలో పలు చోట్ల మొక్క జొన్న సాగు 

రైతుబంధు రాదని హెచ్చరించినా వినని వైనం

ప్రభుత్వ నిర్దేశంతో నష్టమనే భావనలో రైతాంగం

మొక్కజొన్న వేస్తున్నోళ్లలో మెజారిటీ రైతులు కౌలుదారులే..


వనపర్తి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట, రేవల్లి, చిన్నంబావి మండలాల్లో రైతులు మొక్కజొన్న సాగు పట్ల అంత ఆసక్తి చూపుతున్నారు. గత సంవత్సరం ఈ మూడు మండలాల్లోనే మొక్కజొన్న దాదాపు 12వేల పైచిలుకు ఎకరాల్లో సాగైంది. అందులో మెజారిటీ చిన్నంబావి మండలంలో ఎనిమిది వేల ఎకరా ల్లో సాగైంది. గోపాల్‌పేట, రేవల్లి మండలాల్లో సాగు తగ్గినా చిన్నంబావి మండలంలో ఒక్క ఎకరా కూడా సాగు తగ్గే అవకాశాలు లేవు. 


కౌలుదారులే ఎక్కువ..

ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు మెజా రిటీ కౌలు రైతులే ఉన్నారు. రెండు పంటలు సాగు చేసు కుంటే ఒక పంట కౌలుకు పోయినా రెండో పంట చేతికి వస్తుందనే ఆశతో ఉంటాడు. అందుకోసం స్వల్పకాలిక పంటలను ఎంచుకుంటాడు. సాగు నీరు సరిగా లేని ప్రాంతాల్లో వానాకాలం ప్రారంభంలోనే మొక్కజొన్న వేసి ముందస్తు రబీలో వేరుశనగ, శనగ, మినుములు, పెస లు వంటి పంటలు వేసుకుంటారు. దీనివల్ల కౌలు రైతు కు గిట్టుబాటు అ వుతుంది. ప్రభుత్వం సూచించిన విధంగా మొక్కజొన్న సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ఉండదు. దీంతో ఇప్పటికే చిన్నం బావి మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గోపాల్‌పేట మండలంలో 85 ఎకరాలు, రేవల్లి మండలంలో 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. 


కందిపై శ్రద్ధ పెట్టలే..

జిల్లాలో 15 వేల ఎకరాల్లో ఉన్న కంది సాగును ఈ ఏడాది 30వేల ఎకరాలకు పెంచాలని అధికారులు లక్ష్యం గా పెట్టుకున్నారు. మొక్కజొన్న సాగును మొత్తమే చేప ట్టకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం స్వల్పకాలిక రకమైన పీఆర్‌ జీ 176 రకం కంది విత్తనాలను తెప్పించారు. కానీ అధికారులు చేసిన కసరత్తు వృథా అయింది. స్వల్పకాలిక కంది వేస్తే దిగు బడి తక్కువగా వచ్చి నష్టపోతామని, దీర్ఘకాలిక కంది సాగు చేస్తే ఒక పంట వచ్చి నష్టపోతామని రైతులు భావించారు. ఈ మేరకు చిన్నంబావి మండలంలో ఇప్ప టికే ఆరు వేల ఎకరాలు మొక్కజొన్న సాగు కాగా.. వెల్టూరు, చిన్నమారూరు, పెద్దమారూరు లో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల పంట వేయలేదు. వారు కూడా మొక్కజొన్న సాగుకు దుక్కులు సిద్ధం చేసుకుం టున్నారు. 

Updated Date - 2020-07-08T11:21:01+05:30 IST