వ్యాధులు సోకకుండా పశువులను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2020-12-16T03:52:34+05:30 IST

పశువులకు సీజనల్‌ వ్యాధులు సోకకుండా డీవా ర్మింగ్‌ మందులను పశువులకు తాపి కాపాడుకోవాలని జిల్లా పశువైద్యశాఖ అధి కారి డాక్టర్‌ అంజిలప్ప సూచించారు.

వ్యాధులు సోకకుండా పశువులను కాపాడుకోవాలి
తిమ్మాజిపేటలో పశువులకు మందులు వేయిస్తున్న జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప

- జిల్లా పశువైద్యశాఖ అధికారి డాక్టర్‌ అంజిలప్ప

బిజినేపల్లి, డిసెంబరు 15: పశువులకు సీజనల్‌ వ్యాధులు సోకకుండా డీవా ర్మింగ్‌ మందులను పశువులకు తాపి కాపాడుకోవాలని జిల్లా పశువైద్యశాఖ అధి కారి డాక్టర్‌ అంజిలప్ప సూచించారు. మండల పరిధిలోని పోలేపల్లిలో మంగళ వారం నిర్వహించిన డీవార్మింగ్‌ శిబిరాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఆరోగ్యవంతమైన పశుసంపదను పెంపొందించుకునేందుకు పశు వైద్యశాఖ డాక్టర్లను సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం ద్వారా అదనపు ఆదా యం సమకూర్చుకొని అన్నదాతలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని తెలిపారు. ఎం పీపీ శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ ఆశోక్‌, ఉపసర్పంచ్‌ వసంత్‌కుమార్‌ పశు వైద్యాధి కారులు డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, దివ్యభారతి, మునెమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. 


పశువైద్య శిబరాలను వినియోగించుకోండి 

తిమ్మాజిపేట: పశువైద్య శిబిరాలను వినియోగించుకొని రైతులు తమ పశువులకు నట్టల నివారణ మందులు విధిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా క్టర్‌ అంజిలప్ప సూచించారు. మండల పరిధిలోని మరికల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి పశువులకు మందులు వేశారు. పశువైద్యాధికారులు శ్రావణి,  శివరాజ్‌, ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి, సర్పంచులు హన్మంతు, గమ్లీ, ఏఎంసీ డైరెక్టర్‌ హుస్సేనీ, సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.


Read more