గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2020-07-20T11:32:57+05:30 IST

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయ డమే ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి


మల్దకల్‌, జూలై 19: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయ డమే  ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని దళిత కాలనీలో రూ.10లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.  ఎం పీపీ  రాజారెడ్డి, సర్పంచ్‌ యాకోబు, తిమ్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అజయ్‌, వెంకటన్న, ఆంజనేయులు, సవారన్న, నరేందర్‌, తిమ్మరాజు పాల్గొన్నారు. 


సహాయ నిధి సొమ్మును వినియోగించుకోవాలి  

గద్వాల టౌన్‌: ఆపదలో ఉన్న వారిని ఆదుకు నేందుకు సీఎం సహా యనిధి నుంచి అందే సొమ్మును లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 11మందిని సీఎం సహాయనిధి నుంచి అందిన చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అందించారు.  మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ బాబర్‌, చెన్నయ్య,   సుభాన్‌, కుడిగుడ్ల సలామ్‌ పాల్నొన్నారు.

Updated Date - 2020-07-20T11:32:57+05:30 IST