విద్యుదాఘాతంతో వివాహిత మృతి

ABN , First Publish Date - 2020-12-14T03:56:37+05:30 IST

స్వీచ్‌బోర్డులో నుంచి వాటర్‌హీట ర్‌ను తీస్తూ విద్యుదాఘాతానికి గురై కల్పన(27)అనే మహిళ మృతి చెందింది.

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

జడ్చర్ల, డిసెంబరు 13 : స్వీచ్‌బోర్డులో నుంచి వాటర్‌హీట ర్‌ను తీస్తూ విద్యుదాఘాతానికి గురై కల్పన(27)అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం ఉదయం పట్టణం లోని రంగారావుతోటలో చోటు చేసుకుంది. జడ్చర్ల సీఐ వీరస్వామి తెలిపిన వివరాల మేరకు... ఒరిస్సా రాష్ట్రం, కటక్‌లోని బలిజారి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రౌత్‌, కల్పన దంపతు లు రంగారావుతోటలో నివాసం ఉంటున్నారు. పోలేపల్లి సెజ్‌లోని ఓ ఫార్మ కంపెనీలో శ్రీనివాస్‌రౌత్‌ ఉద్యోగం చేస్తున్నా డు. ఆదివారం ఉదయం వేడినీళ్ల కోసం కరెంటు బోర్డులో వాటర్‌ హీటర్‌ను పెట్టి తీస్తుండగా కల్పన విద్యుదాఘా తా నికి గురైంది. వెంటనే చికిత్స కోసం బాదేపల్లి సీహెచ్‌సీకి తీ సుకెళ్లగా అప్ప టికే మృతిచెందిందని వైద్యులు వెల్లడించారు. ఆమె భర్త శ్రీని వాస్‌రౌత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 


Updated Date - 2020-12-14T03:56:37+05:30 IST