బాధితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

ABN , First Publish Date - 2020-05-09T10:03:45+05:30 IST

రోడ్డు విస్తరణలో నష్టపోతున్న పేదలను గుర్తించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌

బాధితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా


వనపర్తి కలెక్టరేట్‌, మే 8 : రోడ్డు విస్తరణలో నష్టపోతున్న పేదలను గుర్తించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు. శుక్రవారం ఆమె గోపాల్‌పేటలో హరితహారం కింద నాటిన మొక్కలకు నీరు పోశారు. అనంతరం చిట్యాల రహదారిలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డును పరిశీలించారు.


నాగవరం సమీపంలో డంపింగ్‌ యార్డు నిర్మాణానికి స్థలాన్ని చూడాలని మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అదేవిధంగా అప్పాయిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-05-09T10:03:45+05:30 IST