-
-
Home » Telangana » Mahbubnagar » varshamlonu snanam
-
వర్షంలోనూ స్నానం
ABN , First Publish Date - 2020-11-28T03:04:41+05:30 IST
తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం పుల్లూరు ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

తరలివస్తున్న ఆంధ్ర భక్తులు
ఉండవల్లి, నవంబరు 27: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం పుల్లూరు ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుం డా వర్షం కురుస్తున్నా అందులోనే స్నానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన భీమ వరం, రావులపాలెం, కాకినాడ, విజయ నగరం ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చా రు. పిండ ప్రదానాలు చేశారు. మిషన్ భగీరథ పథకం ప్రభుత్వ సలహాదారుడు జ్ఞానేశ్వర్, హైదరాబాద్ సీటీఓ రవికుమార్ కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేశారు.
భక్తులు ఇబ్బందులు పడొద్దు
భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పుల్లూరు ఘాట్‌ను పరిశీలించారు. తుపాను కారణంగా వర్షం కురు స్తున్నందున ఇబ్బందులు లేకుండా చూడాల న్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు.