-
-
Home » Telangana » Mahbubnagar » vari kendralu
-
రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు
ABN , First Publish Date - 2020-11-22T04:02:48+05:30 IST
రైతుల వద్దకే కొనుగోలు కేంద్రా లను తీసుకువచ్చి మద్దతు ధరతో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ, ఎంపీపీ అల్వాల ప్రతాప్‌గౌడ్ అన్నా రు

జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ
గద్వాల రూరల్/ ధరూర్, నవంబరు 21 : రైతుల వద్దకే కొనుగోలు కేంద్రా లను తీసుకువచ్చి మద్దతు ధరతో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ, ఎంపీపీ అల్వాల ప్రతాప్‌గౌడ్ అన్నా రు. శనివారం మండల పరిధిలోని లత్తీపురం, బీరోలు, అనంతాపురం గ్రామా లలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ రాజేశ్వరమ్మ, పీఏసీఎస్ చైర్మన్ ఎంఏ సుభా న్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చెన్నయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్-ఏ రకానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868 ధర కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రవీణ, సీసీలక్ష్మి, సర్పంచులు భారతి, జయమ్మ, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు శ్యామల, రాధ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు, నాయకులు నీలేశ్వ ర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల, భీంపురం, రేవులపల్లి గ్రామాల్లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సూచన మేరకు ధరూరు ఎంపీపీ నజ్మున్నిసాబేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు పంట సాయం మొదలుకొని దిగుబడిని విక్రయించే వరకు రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.