రియల్‌ మాఫియా .... కొల్లాపూర్‌లో అనుమతులు లేని వెంచర్లు

ABN , First Publish Date - 2020-03-12T06:09:54+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా రియల్‌ వెంచర్లు పెరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాజకీయ పలుకుబడి ఉన్న వారు

రియల్‌ మాఫియా ....  కొల్లాపూర్‌లో అనుమతులు లేని వెంచర్లు

రాజకీయ బలంతో రియల్టర్లు పేట్రేగిపోతున్నారు. వారి అండదండలతో అనుమతులు లేకుండానే  వెంచర్లు వేస్తున్నారు. కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అధికారుల లెక్కల ప్రకారం 14 వెంచర్లు ఉన్నాయి. ఇందులో 13 వెంచర్లకు అనుమతులు లేవు. 71.3 గుంటల్లో అక్రమ వెంచర్లను గుర్తించినట్లు అధికారులు చెపుతున్నా వాస్తవానికి కొల్లాపూర్‌ పరిధిలోనే వేలాది ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఉండడం గమనార్హం. ఇలా నాగర్‌కర్నూల్‌ పట్టణ సమీపంలోని కొల్లాపూర్‌ చౌరస్తా, కేసరి సముద్రం, కల్వకుర్తి, కొల్లాపూర్‌లో అక్రమ వెంచర్లు వెలిశాయి. 


బలవంతంగా వ్యవసాయ భూములను కూడా సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ వెంచర్ల జోలికి అధికారులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇటీవల కొల్లాపూర్‌లో అక్రమ వెంచర్‌లో రాళ్లను తొలగించిన మునిసిపాలిటీ కమిషనర్‌పైకి ఆయన కార్యాలయంలోనే రాజకీయ పలుకుబడి కల్గిన రియల్‌ వ్యాపారులు దాడులకు పాల్పడడం తెలిసిందే. దీని ప్రభావంతో ప్రభుత్వ, భూదాన, వ్యవసాయ, చెరువులకు, కుంటలకూ ముప్పు వాటిల్లింది.  ఇలాంటి వెంచర్లలో కొంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతోంది.  

కొల్లాపూర్‌ రూరల్‌, మార్చి 11: నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా రియల్‌ వెంచర్లు పెరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాజకీయ పలుకుబడి ఉన్న వారు ప్రవేశించడంతో ప్రభుత్వ, భూదాన, వ్యవసాయ, చెరువులకు, కుంటలకు ముప్పు వాటిల్లింది. రియల్‌ వెంచర్లు అక్రమంగా వేస్తున్న అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులు లేని వెంచర్లలో ఎన్నో ఆశలతో కొంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు అక్రమ వెంచర్ల ద్వారా ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతోంది. కొంతమంది రియల్‌ వ్యాపారులు ఒక అడుగు ముందుకేసి డబుల్‌ రిజిస్రేషన్లకు పాల్పడుతున్నారు.

 నాగర్‌కర్నూల్‌ జిల్లాతో పాటు కొల్లాపూర్‌, కల్వకుర్తిల్లో ఆర్డీవో కార్యాలయాలు ఏర్పడిన తర్వాత రియల్‌ భూం ఊపందుకుంది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌ పట్టణ సమీపంలోని కొల్లాపూర్‌ చౌరస్తా, కేసరి సముద్రం, కల్వకుర్తి, కొల్లాపూర్‌లో అక్రమ వెంచర్లు వెలిశాయి. బలమైన రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో రియల్‌ వెంచర్ల కోసం బలవంతంగా వ్యవసాయ భూములను కూడా సేకరిస్తున్నారు. 

కొల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాగర్‌కర్నూల్‌ రోడ్డు, పెంట్లవెల్లి రోడ్డుకు ఇరువైపులా రియల్‌ వెంచర్లు వేశారు. కొల్లాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుంది. ఇదే అదునుగా భావించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు డబుల్‌ రిజిస్రేషన్లకు పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రియల్‌  వ్యాపారంలో రూ.కోట్లు గడించిన రాజకీయ నాయకులకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మునిసిపాలిటీ చట్టం మింగుడు పడటం లేదు. మారిన రాజకీయ పరిణమాలు కూడా ఇబ్బంది తెచ్చిపెట్టింది. గతంలో మునిసిపాలిటీ అనుమతి లేకుండానే వెంచర్లు వేయడంతో పాటు విక్రయాలు చేపట్టారు. 

కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అధికారుల లెక్కల ప్రకారం 14 వెంచర్లు ఉన్నాయి. ఇందులో 13 వెంచర్లకు అనుమతులు లేవు. 71.3 గుంటల్లో అక్రమ వెంచర్లను గుర్తించినట్లు అధికారులు చెపుతున్నా వాస్తవానికి కొల్లాపూర్‌ పరిధిలోనే వేలాది ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఉన్నా అధికారులు పటి ్టంచుకోవడం లేదు. ఒక వేళ అక్రమ వెంచర్ల జోలికి అధికారులు వెళ్లినా తమ రాజకీయ బలంతో పనులు చేయించుకుంటున్నారు. 

కొల్లాపూర్‌లో అక్రమ వెంచర్‌లో రాళ్లను తొలగించిన మున్సిపాలిటీ కమిషనర్‌పైకి ఆయన కార్యాలయంలోనే రాజకీయ పలుకుబడి కల్గిన రియల్‌ వ్యాపారులు దాడులకు దిగిన విషయం విదితమే. కొల్లాపూర్‌ పట్టణానికి సమీపంలో రామాపురం బాటలలో ఉన్న ఒక్క వెంచర్‌ కూడా భూదానం కింద దానం చేసిన భూమిలో ఉన్నట్లు సమాచారం. దానం ఇచ్చిన భూములను అమ్మేందుకు, కొనేందుకు వీలు లేకున్నా ఏకంగా వెంచర్లు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్‌ మాఫియాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతోంది. 

అనుమతులను తీసుకోవాలి 

- కొల్లాపూర్‌ మునిసిపాలిటీ వైస్‌ ఛైర్మన్‌ మహిముదాబేగం 

కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో వేసే వెంచర్లకు తప్పక అనుమతులు తీసుకోవాలి. అక్రమ వెంచర్లు వేసి మునిసిపాలిటీని ప్రజలను మోసం చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి నాయకత్వంలో కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నాం. ఇంతముందుకు జరిగినట్లు అక్రమాలకు తావు లేకుండా చేస్తాం. 


Updated Date - 2020-03-12T06:09:54+05:30 IST