రెండు బైకులు ఢీ : వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-28T03:30:16+05:30 IST

మరికల్‌లో సబ్‌స్టేషన్‌ దగ్గర అదివారం రాత్రి రెండు బైకులు ఢీకొనడంతో రంగప్ప(35)తలకు తీవ్రగాయాలయ్యాయి.

రెండు బైకులు ఢీ : వ్యక్తికి గాయాలు

మరికల్‌, డిసెంబరు 27 : మరికల్‌లో సబ్‌స్టేషన్‌ దగ్గర అదివారం రాత్రి రెండు బైకులు ఢీకొనడంతో రంగప్ప(35)తలకు తీవ్రగాయాలయ్యాయి. ఎల్లిగండ్ల గ్రామానికి చెందిన రంగప్ప మరికల్‌కు వస్తుండగా, బుడ్డగాని తండాకు చెందిన యువకుడి బైక్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర మలుపు వద్ద ఢీకొన్నాడు. పాలమూరు జిల్లా అసుపత్రికి తరలించారు. 


కులంపేరుతో దూషించారంటూ ఫిర్యాదు


కోస్గి రూరల్‌, డిసెంబరు 27 : మూడు రోజుల క్రితం సంపల్లి గ్రామంలో దళితులపై పెత్తం దారులు కుల దూషణ చేశారంటూ చెన్నయ్య ఆదివారం కోస్గి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నరేందర్‌ కథనం మేరకు... సంపల్లి గ్రామానికి చెందిన బందెప్ప మూడు రోజుల క్రితం చనిపోగా అతని శవాన్ని బొడ్రాయి పక్క నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో కొందరు గ్రామ స్థులు గతంలో ఎప్పుడు మీరు ఇటు నుంచి తీసుకెళ్లలేదని, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారని అనడంతో మాటామాట పెరిగి గొడవకు దారిదిసింది. దీంతో చెన్నయ్య గ్రామానికి చెందిన 10మందిపై కోస్గి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు నిర్వహించి నిజమని తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్సై నరేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-12-28T03:30:16+05:30 IST