బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-18T03:19:23+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
నిరాహార దీక్షలో మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య

- టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య - జాక్టో ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 17: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో సామూ హిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలకు టీఎస్‌యూ టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య ముఖ్య అతిథిగా హాజరై దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తదితర కారణాలతో ఏకీకృత సర్వీసు రూల్స్‌ సమస్య, పదోన్నతులు నిలిపి వేశారన్నారు. దీంతో వందలాది మంది సీనియర్‌ ఉపాధ్యాయులు పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ పొందుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యా ర్థులు నష్టపోతున్నారన్నారు. ఫిబ్రవరి 2019లో స్కూ ల్‌ అసిస్టెంట్స్‌గా అప్‌గ్రేడ్‌ చేసిన పండిట్‌, పీఈటీలకు ఆయా పోస్టుల్లో పదోన్నతులు కల్పించలేదన్నారు. మోడల్‌ స్కూల్‌ ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా బదిలీలు చేపట్టలేదన్నారు. అలాగే అంతర్రాష్ట్ర, అంతర్‌  జిల్లా బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారన్నారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్ఠికి తీసుకువచ్చేందుకు జాక్టో, యూఎస్పీసీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా దశలవారిగా పోరాటాలకు కార్యాచరణ చేపట్టామని పేర్కొ న్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చే శారు. అనంతరం గాంధీపార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి డీఆర్వో మధుసూదన్‌నాయక్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జాక్టో, యూఎస్పీసీ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సుదర్శన్‌, కార్యవర్గ సభ్యులు పి.వహీద్‌ఖాన్‌, జె.రామస్వామి, సి.భాస్కర్‌, ఎస్‌.సాయిరెడ్డి, శ్రీనివాసులు, ఎస్‌.నిరంజన్‌యాదవ్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకు లు ఎం.శ్రీధర్‌శర్మ, ఎస్‌.మురళి, కె.లక్ష్మణ్‌, సి.వెంకటయ్య, చంద్రశేఖర్‌, రమేష్‌, గోవర్దన్‌, తిరుపతయ్య, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు  పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-18T03:19:23+05:30 IST