-
-
Home » Telangana » Mahbubnagar » Today is the bandi sanjay came
-
నేడు పేటకు బండి సంజయ్ రాక
ABN , First Publish Date - 2020-12-20T04:13:30+05:30 IST
నారా యణపేట జిల్లా కేంద్రా నికి బీజేపీ రాష్ట్రఅధ్యక్షు డు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రానున్నారని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం తెలి పారు.

నారాయణపేట టౌన్, డిసెంబరు 19 : నారా యణపేట జిల్లా కేంద్రా నికి బీజేపీ రాష్ట్రఅధ్యక్షు డు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రానున్నారని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం తెలి పారు. వీరితో పాటు ఎ మ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆదివారం ఉదయం జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. ముందుగా మరికల్ మండలం అప్పంపల్లిలో వివేకానంద విగ్రహం ఆవిష్కరించి, 11 గంటలకు నారాయణ పేట సింగారానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి నిర్వహించే బైక్ ర్యాలీలో వారు పాల్గొంటారని, ఒంటి గంటకు జీపీ శెట్టి ఫంక్షన్ హాల్‌లో జరిగే వ్యవసాయ చట్టాల అవగాహన సదస్సులో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సదస్సులో రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. సాయంత్రం సదస్సు సభ వేదిక ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర నాయకు డు రతంగ్ పాండు రెడ్డి, వెంకట్రాములు, నందు నామాజీ, రఘు రామయ్య, గోపాల్ యాదవ్ తదితరులు పరిశీలించారు.
‘రైతుల నుంచి వ్యతిరేకతతో తోకముడిచిన కేసీఆర్’
ధన్వాడ : రైతు వ్యవసాయ బిల్లుపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ రైతుల నుంచి వ్యతిరే కత రావడంతో తోకముడిచారని బీజేపీ జిల్లా నాయకులు రఘువీర్‌యాదవ్, పి. రామచంద్రయ్య విమర్శించారు. శనివారం ధన్వాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడు తూ రైతుల సంక్షేమం కోసమే ప్రధాని నరేంద్రమోదీ రైతు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు ఉమేష్‌కుమార్‌గుప్తా, గోవర్ధన్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులుగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాములు పాల్గొన్నారు.