పెద్దూటిలో పెద్దపులి

ABN , First Publish Date - 2020-12-31T03:35:25+05:30 IST

పులుల అభయారణ్యంగా నల్లమల ఖ్యాతి గడించింది.

పెద్దూటిలో పెద్దపులి
పెద్దూటి వద్ద సీసీ టీవీ ఫుటేజీల్లో కనిపించిన పెద్దపులి

- పులి జాడలు గుర్తించిన అటవీ అధికారులు 

- భయాందోళనలో మొలచింతలపల్లి గ్రామస్థులు


కొల్లాపూర్‌, డిసెంబరు 30 : పులుల అభయారణ్యంగా నల్లమల ఖ్యాతి గడించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వి స్తరించిన నల్లమలలో ఇటీవల పులులు, చిరుతల సంతతి పెరుగుతోంది. తాజాగా కొల్లాపూర్‌ మండలం మొల చింతలపల్లి గ్రామ అటవీ పరిధిలోని పెద్దూటి రహదారిలో బుధవారం పెద్దపులి సంచరించిన జాడలను గు ర్తించినట్లు కొల్లాపూర్‌ అటవీ రేంజర్‌ రవీందర్‌ తెలిపారు. దీంతో మొలచింతలపల్లి గ్రామస్థులు భయాం దోళన చెందుతున్నారు. చుట్టూ పొలాల్లో పని చేసే రైతులు, మూగజీవాలను, పశువులను కాసే కాప రులు భయంతో గ్రామంలోకి పరుగులు పెడుతున్నారు. వారం రోజుల కిందట ఇదే మండలం గేమ్యానాయక్‌తండా పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను అటవీ అధికారులు గుర్తించారు. దీంతో నల్లమల గ్రామాల ప్రజలు భయం భయం మధ్య కా లం గడుపుతున్నారు. కాగా, పెద్దపులి సంచరిస్తుండటంతో నల్లమల సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికా రులు సూచించారు.

Updated Date - 2020-12-31T03:35:25+05:30 IST