కార్యదర్శుల పని ఒత్తిడి తగ్గించాలి
ABN , First Publish Date - 2020-05-09T10:03:03+05:30 IST
పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని ఆ సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు.
పెద్దమందడి / పాన్‌గల్, మే 8 : పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని ఆ సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం యారొనిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్ర గురువారం ఆత్మహత్య చేసుకోగా, ఆయన చిత్రపటానికి శుక్రవారం స్థానికంగా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పాన్‌గల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ సాయిబృందకు అందజేశారు.