రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-06-18T10:59:07+05:30 IST

రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు

రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి


బిజినేపల్లి, జూన్‌ 17 : రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలెం శివారులో బుధవారం రూ.83 లక్షల వ్యయంతో నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ తూం హరిచరణ్‌రెడ్డి, సర్పంచ్‌లు లావణ్య, మాధవి, ఎంపీటీసీ సభ్యురాలు సోములమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగనమోని కిరణ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ చికొండ్ర రాములు, లక్ష్మయ్య, బానూరి కిరణ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T10:59:07+05:30 IST